ఎనిమిది మందిపై పీడీ యాక్ట్ | In addition to placing specialized in smuggling redwood | Sakshi
Sakshi News home page

ఎనిమిది మందిపై పీడీ యాక్ట్

Jan 17 2014 2:30 AM | Updated on Sep 2 2017 2:40 AM

ఎర్రచందనం అక్రమ రవాణాలో ఆరితేరిన స్మగ్లర్లపై ప్రత్యేక నిఘాను ఉంచడంతో పాటు 8 మందిపై పీడీ యాక్టుకు ప్రతిపాదనలు పంపినట్లు డీఎఫ్‌ఓ పల్లె శివశంకర్‌రెడ్డి పేర్కొన్నారు.

బ్రహ్మంగారిమఠం, న్యూస్‌లైన్‌: ఎర్రచందనం అక్రమ రవాణాలో ఆరితేరిన స్మగ్లర్లపై ప్రత్యేక నిఘాను ఉంచడంతో పాటు 8 మందిపై  పీడీ యాక్టుకు ప్రతిపాదనలు పంపినట్లు డీఎఫ్‌ఓ పల్లె శివశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. బి. మఠం వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొద్దుటూరు డివిజన్  పోరుమామిళ్ల, బద్వేలు, వనిపెంట రేంజ్ పరిధిలోని నలుగురిపై  పీడీ యాక్ట్ పెట్టాలని కలెక్టర్‌ను కోరగా  సానుకూలంగా  స్పదించారన్నారు.  అలాగే మరో నలుగురిపై పీడీ యూక్ట్ కోసం ప్రతిపాదనలు పంపామన్నారు.  

 ఎర్రచందనం అక్రమ రవాణాపై  ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.  డివిజన్ పరిధిలో  25 మంది సాయుధ బలగాలు ఉన్నారన్నారు. పొలీసు సిబ్బందితో ప్రతి రేంజ్ పరిధిలో కవాతు  నిర్వహిస్తున్నామన్నారు. బి.మఠం మండలంలో ఎర్రచందనం కూలీలే స్మగ్లర్లుగా మారుతున్నట్లు సమాచారం ఉందన్నారు. ఇందులో మల్లెపల్లెకు చెందిన వారు  ఎక్కువగా ఉన్నారన్నారు. వీరిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement