అక్రమంగా మద్యంబాటిళ్ల తరలింపు | illegal transportation of liquor | Sakshi
Sakshi News home page

అక్రమంగా మద్యంబాటిళ్ల తరలింపు

Sep 22 2015 5:03 PM | Updated on Sep 3 2017 9:47 AM

అక్రమంగా ఏజెన్సీ ప్రాంతాలకు తరలిస్తున్న 700 మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు.

గుమ్మలక్ష్మీపురం (విజయనగరం) : అక్రమంగా ఏజెన్సీ ప్రాంతాలకు తరలిస్తున్న 700 మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. కురుపం నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు ఆటోలో మద్యం బాటిళ్లు తరలిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు మాటువేసి వారిని పట్టుకున్నారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని జంక్షన్ వద్ద మంగళవారం జరిగింది. ఆటోలో ఉన్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement