విశాఖలో హైదరాబాద్ ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య | IITian of hyderabad commits suicide in visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో హైదరాబాద్ ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

Jan 18 2014 1:04 PM | Updated on Nov 6 2018 8:41 PM

హైదరాబాద్కు చెందిన శివతేజ అనే ఐఐటీ విద్యార్థి విశాఖపట్నం సీతమ్మధార ప్రాంతంలో ఉన్న అశ్వనీ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబాద్కు చెందిన ఓ ఐఐటీ విద్యార్థి విశాఖపట్నంలో ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్కు చెందిన శివాజీ తేజ(26) ముంబై ఐఐటీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇతడు వ్యక్తిగత పనిమీద విశాఖపట్నానికి ఈనెల 16వ తేదీన వచ్చాడు. ఇక్కడి సీతమ్మధార ప్రాంతంలో ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న అశ్వనీ లాడ్జిలో గది తీసుకున్నాడు. గురువారం మధ్యాహ్నం వాటర్ బాటిల్ తెచ్చుకోడానికని కిందకి వచ్చాడు. ఆ తర్వాత తలుపు వేసుకుని గదిలోనే ఉండిపోయాడు. భోజనానికి రాలేదని హోటల్ యాజమాన్యం గురువారం సాయంత్రం తలుపు తట్టినా తీయలేదు. మళ్లీ శుక్రవారం ఉదయం కూడా తలుపు తట్టినా తీయలేదు. దాంతో అనుమానం వచ్చిన యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. వారు వచ్చి తలుపు పగలగొట్టి చూడగా, పాలిథిన్ కవర్ ముఖానికి చుట్టుకుని అతడు ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. పోలీసులు హైదరాబాద్ నగరంలో ఉన్న అతడి తల్లిదండ్రులకు ఈ సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడినుంచి బయల్దేరి విశాఖకు వస్తున్నారు.

అయితే ఆత్మహత్యకు కారణాలేంటన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన శివాజీ తేజ అసలు విశాఖపట్నం ఎందుకు వచ్చాడు, ఇక్కడ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే కోణాల్లో దర్యాప్తు సాగుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement