
సాక్షి, విశాఖ సిటీ: విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(వీఎంఆర్‌డీఏ) కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి పులిపాటి కోటేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2009 కేడర్‌కు చెందిన కోటేశ్వరరావు ఏపీపీఎస్ కార్యదర్శిగా, కడప, పశ్చిమ గోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన వెయిటింగ్ జాబితాలో ఉన్నారు. వీఎంఆర్‌డీఏ కమిషనర్‌గా ఉన్న బసంత్‌కుమార్ టీటీడీ జేఈవోగా బదిలీ కాగా.. ఇన్‌చార్జి కమిషనర్‌గా ప్రస్తుతం జీవీఎంసీ కమిషనర్ జి.సృజన వ్యవహరిస్తున్నారు.
సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా..
సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని వీఎంఆర్‌డీఏ కమిషనర్‌గా రానున్న కోటేశ్వరరావు తెలిపారు. చైర్మన్, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమన్వయంతో వీఎంఆర్‌డీఏను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. సంస్థను వివాదరహితంగా, పారదర్శకంగా నడిపించడమే తమ ధ్యేయమని అన్నారు.