రాజీనామా చేయలేదు..జగన్తోనే ఉంటా | I will remain in YSRCP till my last breath: Nallapareddy prasanna kumar reddy | Sakshi
Sakshi News home page

రాజీనామా చేయలేదు..జగన్తోనే ఉంటా

Jun 24 2015 1:47 PM | Updated on Jul 25 2018 4:09 PM

రాజీనామా చేయలేదు..జగన్తోనే ఉంటా - Sakshi

రాజీనామా చేయలేదు..జగన్తోనే ఉంటా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఖండించారు.

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఖండించారు. పార్టీకి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, చివరి వరకూ వైఎస్ జగన్ వెంటే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తాను పార్టీకి రాజీనామా చేసి ఆ లేఖను ఫ్యాక్స్ చేసినట్లు కొన్ని మీడియా ఛానల్స్ అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. నల్లపరెడ్డి బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ' నేను పార్టీకి రాజీనామా చేయలేదు. రాజీనామా లేఖను పార్టీ ఆఫీసుకు పంపించినట్లు, రాజీనామా చేసినట్లు చెప్పారు. ఏ రాజీనామా లేఖను పంపలేదు. ఫ్యాక్స్ చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను.

 ఏబీఎన్ ఛానల్కు చెందిన హైదరాబాద్ రిపోర్టర్ ఈరోజు ఉదయం నేను రాజీనామా లేఖను వైఎస్ జగన్కు ఫ్యాక్స్ చేసినట్లు చెబుతున్నాడు. నెల్లూరు రిపోర్టర్ను లైవ్లోకి తీసుకుని అడిగితే... నేను రాజీనామా చేయలేదు, ఫ్యాక్స్ చేయలేదని చెప్పాడు. అయినా  ఇటువంటి అసత్య ప్రచారాలు ఎందుకు. ఏదైనా ఉంటే నన్నే అడిగితే నేను చెబుతాను. ఏదైనా చేస్తే మీఅందరికీ చెప్పే చేస్తాను. జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని నేను అనలేదు. నాకు రాజీనామా చేసే యోచనలేదు. 

 

మా మధ్య విభేదాలు లేవు. జగన్మోహన్ రెడ్డిగారు నన్ను తిట్టినట్లు...ఆంధ్రజ్యోతి వాళ్లు విన్నారేమో...నాకు అయితే తెలియదు. ఆయన నన్ను ఎప్పుడూ గౌరవంగా చూస్తారు. ...నా చివరి రక్తపు బొట్టు వరకూ వైఎస్ఆర్ సీపీలోనే కొనసాగుతాను. 2012లో ఏ మాట అయితే చెప్పానో... ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉంటాను. అన్ని విషయాలు మా నాయకుడితో మాట్లాడుకుంటాను' అని అన్నారు.  చంద్రబాబు నాయుడు...ఎంపీటీసీలను సంతలో సరుకులను కొన్నట్లు కొంటున్నారని నల్లపరెడ్డి మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement