'హిందూపురం నుంచి భారీ మెజార్టీతో గెలుస్తా' | I will get Victory with Huge Majority from Hindupur, says Nandamuri Balakrishna | Sakshi
Sakshi News home page

'హిందూపురం నుంచి భారీ మెజార్టీతో గెలుస్తా'

May 7 2014 8:03 PM | Updated on Aug 29 2018 1:59 PM

'హిందూపురం నుంచి భారీ మెజార్టీతో గెలుస్తా' - Sakshi

'హిందూపురం నుంచి భారీ మెజార్టీతో గెలుస్తా'

అనంతపురం జిల్లా హిందూపురం ప్రజలంతా తమ కుటుంబం వంటి వారని ప్రముఖ నటుడు, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ తెలిపారు.

అనంతపురం జిల్లా హిందూపురం ప్రజలంతా తమ కుటుంబం వంటి వారని ప్రముఖ నటుడు, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ తెలిపారు. బుధవారం సీమాంధ్రలో ఎన్నికలు ముగిసిన అనంతరం బాలకృష్ణ హిందూపురంలో విలేకర్లతో మాట్లాడారు. హిందూపురంను ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు.  

 

హిందూపురం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సూచనల మేరకు తాను పార్టీలో నడుచుకుంటానని చెప్పారు. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడానికి యువతే ప్రధాన కారణమని బాలకృష్ణ విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement