భర్త టిఫిన్ తినలేదని.. | husband refuses to eat breakfast, wife commits suicide | Sakshi
Sakshi News home page

భర్త టిఫిన్ తినలేదని..

May 11 2015 6:02 PM | Updated on Nov 6 2018 7:56 PM

భర్త టిఫిన్ తినలేదని.. - Sakshi

భర్త టిఫిన్ తినలేదని..

భర్త అలిగి, టిఫిన్ చేయకుండా వెళ్లాడని మనస్తాపానికి గురైన ఓ ఇల్లాలు బలవన్మరణానికి పాల్పడింది.

జీడిమెట్ల (హైదరాబాద్) : భర్త అలిగి, టిఫిన్ చేయకుండా వెళ్లాడని మనస్తాపానికి గురైన ఓ ఇల్లాలు బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని మార్కండేయనగర్‌లో నివాసం ఉండే సంతోష్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుంటాడు. కాగా సోమవారం ఉదయం సంతోష్ ఇంట్లో అలిగి టిఫిన్ తినకుండా వెళ్లినట్టు సమాచారం. అయితే ఇది తట్టుకోలేక సంతోష్ భార్య ఉష(28) మధ్యాహ్నం సమయంలో చీరతో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మేనమామ శ్రీనివాస్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో ఇది వెలుగు చూసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement