అనుమానంతో భార్యను చంపిన భర్త | Husband kills wife | Sakshi
Sakshi News home page

అనుమానంతో భార్యను చంపిన భర్త

Sep 7 2015 3:52 PM | Updated on Jul 30 2018 8:29 PM

అనుమానంతో ఓ భర్త కట్టుకున్న భార్యను కర్రతో కొట్టి చంపాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కోట మండలం రాఘవాపురంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు (కోట) : అనుమానంతో ఓ భర్త కట్టుకున్న భార్యను కర్రతో కొట్టి చంపాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కోట మండలం రాఘవాపురంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రాఘవాపురం గ్రామానికి చెందిన ఆదిలక్ష్మీ(32), అంకయ్యలు  భార్యాభర్తలు. అయితే గత కొన్ని రోజులుగా తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో అంకయ్య భార్యను హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వాకాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement