కన్నకూతురు కళ్లెదుటే భార్యను హత్యచేసిన భర్త | Husband killed his wife and daughter in front of more than | Sakshi
Sakshi News home page

కన్నకూతురు కళ్లెదుటే భార్యను హత్యచేసిన భర్త

Apr 6 2017 7:32 AM | Updated on Sep 5 2017 8:07 AM

వివాహేతర సంబంధం అనుమానంతో కట్టుకున్న భార్యను కుమార్తె కళ్లేదుటే ఓ వ్యక్తి అతికిరాతకంగా హత్యచేశాడు. పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

చింతపల్లి(పాడేరు): వివాహేతర సంబంధం అనుమానంతో కట్టుకున్న భార్యను  కుమార్తె కళ్లేదుటే ఓ వ్యక్తి అతికిరాతకంగా హత్యచేశాడు. పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తమ్మంగుల పంచాయతీ కె.దుర్గం గ్రామానికి చెందిన సాగిన బాబూరావు, కరుణమ్మ (30)భార్యాభర్తలు.
 
వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. భార్య మీద అనుమానంతో బాబూరావు తరచూ గొడవ పడుతుండేవాడు. మంగళవారం పసుపు ఉడకబెట్టేం దుకు కట్టెల కోసం సమీప అటవీ ప్రాంతా నికి వెళదామని భార్యను నమ్మించాడు. మూడవ కుమార్తె  శ్రీలక్ష్మి కూడా తల్లిదండ్రులతో అడవికి వెళ్లింది. ఊరికి కిలోమీటరు దూరంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. వివాహేతర సంబంధం అనుమానాన్ని భార్యవద్ద వ్యక్తం చేసి, ప్రశ్నించాడు.   దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన బాబూరావు  కట్టెలు నరికేందుకు వెంటతెచ్చుకున్న కత్తితో భార్య మెడపై నరికాడు.   తీవ్ర భయాందోళనకు గురైన కుమార్తె శ్రీలక్ష్మి గ్రామంలోకి పారిపోయింది. బాబూరావు రాత్రంతా అడవిలో ఉండిపోయి బుధవారం పోలీసుల ఎదుటలొంగి పోయాడు. సంఘటనపై ఇన్‌చార్జి సీఐ గోవిందరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌సీ వెంకటరావు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement