పెళ్లి అయినప్పటి నుంచి భార్యతో ప్రతి రోజూ గొడవలే జరుగుతుండటంతో మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి తనువు చాలించాడు.
చిత్తూరు : పెళ్లి అయినప్పటి నుంచి భార్యతో ప్రతి రోజూ గొడవలే జరుగుతుండటంతో మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి తనువు చాలించాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం కోలవారికండ్రిగ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. కోలవారికండ్రిగ గ్రామానికి చెందిన వెంకట ముని(28) అనే వ్యక్తికి మూడేళ్ల కిందట వివాహమైంది. అప్పటినుంచి భార్యతో తరచూ గొడవలు అవుతుండటంతో మనస్థాపం చెందిన అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.