అనంతపురం జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య.. తనను లెక్క చేయకుండా పుట్టింటికి వెళ్లిపోయి తిరిగి రావట్లేదన్న మనస్తాపంతో అతడీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
అనంతపురం జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య.. తనను లెక్క చేయకుండా పుట్టింటికి వెళ్లిపోయి తిరిగి రావట్లేదన్న మనస్తాపంతో అతడీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పరిగి సీతారామపురం కాలనీకి చెందిన ఆంజనేయులు (21) కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంజనేయులు హిందూపురానికి చెందిన ఓ యువతిని నాలుగు నెలల కిత్రం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్లిద్దరూ అదే కాలనీలోని తమ సొంతింట్లోనే కాపురం ఉంటున్నారు.
అయితే, కొన్నాళ్ల క్రితం అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది, మళ్లీ తిరిగి రాలేదు. దాంతో ఆంజనేయులు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపు గడియ పెట్టుకుని, ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ఆంజనేయులును 108 వాహనంలో హిందూపురం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు బెంగళూరుకు తరలించేందుకు యత్నిస్తుండగానే మృతి చెందాడు.