న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు ధర్నా


ఒంగోలు (ప్రకాశం జిల్లా): భర్త మరో పెళ్లి చేసుకోవడంతో న్యాయం చేయాలని కోరుతూ భార్య ఆయన ఇంటిముందే బైఠాయించింది. ఈ సంఘటన శనివారం ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని మామిడిపాలెం వద్ద జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన దాసరి కోటేశ్వరరావు, సుమలతలకు నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. కాగా, రెండేళ్ల తర్వాత కుటుంబ కలహాలతో సుమలత ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ క్రమంలోనే కేసు నమోదు కావడంతో అతను ఆమెను వదిలి వేరుగా ఉంటున్నాడు. ప్రస్తుతానికి కేసు కోర్టు విచారణలో ఉంది.కాగా, ఆరునెలల క్రితం అతను మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఈ విషయం వివాహం జరిగిన నెల రోజుల తర్వాత సుమలతకు తెలియడంతో పోలీసులను ఆశ్రయించింది. వారు ఆమెకు న్యాయం చేయలేదు. దీంతో నేరుగా భర్తను నిలదీయడంతో కుటుంబసభ్యులు ఆమెను కొట్టి పంపారు. చేసేది లేక శనివారం న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ముందే ధర్నాకు దిగింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top