హడ్కో 47వ వ్యవస్థా్థపక దినోత్సవం సందర్భంగా జాతీయ స్థాయిలో వినూత్న ఆలోచనలు అమలు చేసినందుకుగానూ రాష్ట్రానికి వివిధ విభాగాల్లో అవార్డులు దక్కాయి.
సాక్షి, న్యూఢిల్లీ: హడ్కో 47వ వ్యవస్థా్థపక దినోత్సవం సందర్భంగా జాతీయ స్థాయిలో వినూత్న ఆలోచనలు అమలు చేసినందుకుగానూ రాష్ట్రానికి వివిధ విభాగాల్లో అవార్డులు దక్కాయి. ఇందులో మౌలిక వసతుల ప్రణాళిక, రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూముల సేకరణకు సీఆర్‌డీఏకి రెండు అవార్డులు దక్కాయి. మంగళవారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడి చేతుల మీదుగా సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ అవార్డులు అందుకున్నారు.
అలాగే నెల్లూరులో మురుగు నీటి వ్యవస్థ సమర్థ నిర్వహణకుగానూ కార్పొరేషన్‌కు అవార్డు దక్కింది. ఇంజనీర్ మోహన్ ఈ అవార్డు అందుకున్నారు. అలాగే ఏపీఎస్‌ఆర్టీసీ, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్, విజయవాడ హడ్కో బ్రాంచ్‌కు వివిధ విభాగాల్లో అవార్డులు లభించాయి.