ఆస్పత్రికి వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల | house robbery when famlily went to hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రికి వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల

Mar 7 2015 9:37 PM | Updated on Sep 2 2017 10:28 PM

వైద్యం కోసం ఉదయం ఇంటికి తాళం వేసి వెళ్లి సాయంత్రం తిరిగొచ్చే సరికి దొంగలు ఆ ఇంటిలో విలువైన సొత్తును మాయం చేశారు.

సదుం (చిత్తూరు): వైద్యం కోసం ఉదయం ఇంటికి తాళం వేసి వెళ్లి సాయంత్రం తిరిగొచ్చే సరికి దొంగలు ఆ ఇంటిలో విలువైన సొత్తును మాయం చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా సదుం మండలం బుడ్డారెడ్డిగారిపల్లెలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన భాస్కరాచారి, భార్యతో కలసి వైద్యం కోసం శనివారం ఉదయం పుంగనూరు వెళ్లారు.

 

సాయంత్రం 4 గంటలకు ఇంటికి తిరిగిరాగా.. తలపులు తెరచి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని 105 గ్రామలు బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు కనిపించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement