న్యాయం జరగకుంటే హెచ్ఆర్సీని ఆశ్రయిస్తా | Hotel owner attacked to labour in tirumala | Sakshi
Sakshi News home page

న్యాయం జరగకుంటే హెచ్ఆర్సీని ఆశ్రయిస్తా

Dec 21 2014 12:22 PM | Updated on Sep 2 2017 6:32 PM

హోటల్లో వంద రూపాయిలు దొంగలించాడని కార్మికుడిపై యజమాని తన ప్రతాపాన్ని చూపించాడు. దాంతో కార్మికుడి వీపుపై వాతలు వచ్చేలో కొట్టాడు.

తిరుమల : హోటల్లో వంద రూపాయిలు దొంగలించాడని కార్మికుడిపై యజమాని తన ప్రతాపాన్ని చూపించాడు.  దాంతో కార్మికుడి వీపుపై వాతలు వచ్చేల కొట్టాడు.  దీంతో సదరు కార్మికుడు తిరుమల పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అందులోభాగంగా బాధితుడితో సహా పోలీసులు సదరు హోటల్కు చేరుకున్నారు. 

హోటల్ యజమానిని విచారించగా... హోటల్లో పని చేసే కార్మికులను తన సొంత పిల్లలుగా చూసుకుంటానని చెప్పారు. అలాంటిది తాను కార్మికుడిపై దాడి చేయలేదని తెలిపారు.  కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. తనకు న్యాయం జరగకుంటే మానవహక్కుల సంఘాన్ని (హెచ్ఆర్సీ) ఆశ్రయిస్తానని కార్మికుడు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement