‘శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు’

Home Minister Mekathoti Sucharitha Slams On TDP Government - Sakshi

అమరావతి: రాష్ట్ర శాంతి భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని.. హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. శుక్రవారం ఏపీ శాసన మండలిలో ‘శాంత్రి భద్రతల’పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక కేవలం ఆరు హత్యలు మాతమే జరిగాయన్నారు. ఆ ఆరు హత్యలు సైతం కేవలం వ్యక్తిగత, ఇతర కారణాలతో జరిగాయని వెల్లడించారు. ఈ హత్యలను తమ ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదని విమర్శించారు. అదేవిధంగా ‘కోడెల కె ట్యాక్స్‌’ బాధితుల కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయన్నారు. కాగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ చూడమని పేర్కొన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన రాజకీయ హత్యలు, దాడులపై హోంమంత్రి వివరిస్తుండగా.. టీడీపీ సభ్యులు మధ్యలోనే వాకౌట్ చేశారు. మంత్రి వివరణ ఇస్తుంటే మధ్యలోనే టీడీపీ సభ్యులు వాకౌట్‌ చేయడంపై వైఎస్సార్‌సీపీ శాసన సభ్యులు తీవ్రంగా ఆక్షేపణ తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top