మావోయిస్టులకు సహకరిస్తున్న హోంగార్డులు | Home Guards Corporation To Maoists In Seleru | Sakshi
Sakshi News home page

మావోయిస్టులకు సహకరిస్తున్న హోంగార్డులు

May 10 2019 8:40 PM | Updated on May 10 2019 8:44 PM

Home Guards Corporation To Maoists In Seleru - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: సీలేరు జెన్‌కోలో పనిచేస్తున్న ఇద్దరు హోంగార్డులు మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు తెలిసింది. కిలో​ బాబురావు, మరిగల నాగేశ్వరరావు అనే ఇ‍ద్దరు హోంగార్డులు గత కొంతకాలంగా మావోయిస్టులకు సమాచారం అందిస్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిపై నిఘా ఉంచిన పోలీసులు మండలంలోని లంకపాకల వద్ద మావోయిస్టులకు కలిసి వస్తుంటే వారిద్దరి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిద్దరూ మావోయిస్టు నేతలు చలపతిరావు, అరుణకు సహరిస్తున్నట్లు తేలిందని చింతపల్లి ఓఎస్డీ వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement