శ్రీకాకుళంలో 'కిమ్స్' వద్ద ఉద్రిక్తత | High tensions at kims hospital in Srikakulam | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళంలో 'కిమ్స్' వద్ద ఉద్రిక్తత

May 14 2014 11:41 AM | Updated on Sep 2 2018 4:48 PM

శ్రీకాకుళంలోని కిమ్స్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

శ్రీకాకుళంలోని కిమ్స్ ఆసుపత్రి వద్ద  ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టౌన్ప్లానింగ్ నిబంధనలకు విరుద్ధంగా కిమ్స్ ఆసుపత్రి సెల్లార్ నిర్మాణం జరిగిందని ఆరోపిస్తూ మున్సిపల్ సిబ్బంది బుధవారం ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆ క్రమంలో సెల్లార్ నిర్మాణం కూల్చివేసేందుకు మున్సిపల్ సిబ్బంది సమయాత్తమైయ్యారు. మున్సిపల్ సిబ్బంది చర్యలను ఆసుపత్రి సిబ్బంది ప్రతిఘటించారు. దాంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీ సంఖ్యలో కిమ్స్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement