ఎల్జీ పాలిమర్స్ ఘటన: నేడు హైపవర్ కమిటీ నివేదిక | High Power Committee To Submit Report On LG Polymers GAS Leak Incident Today | Sakshi
Sakshi News home page

ఎల్జీ పాలిమర్స్ ఘటనపై నేడు హైపవర్ కమిటీ నివేదిక

Jul 6 2020 11:03 AM | Updated on Jul 6 2020 11:03 AM

High Power Committee To Submit Report On LG Polymers GAS Leak Incident Today - Sakshi

సాక్షి, తాడేపల్లి: విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ ప్రమాదంపై హైపవర్‌ కమిటీ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నేడు నివేదికను సమర్పించనుంది. అటవీ పర్యావరణం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ నేతృత్వంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌, విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, కలెక్టర్ సభ్యులుగా హైపవర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మే 7న ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీక్‌ ఘటనపై ఆరు ప్రత్యేక కమిటీలతో పాటు హైపవర్ కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. ఐదు గ్రామాల బాధిత ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు, అధికారులు, సీనియర్ జర్నలిస్ట్‌లతో హైపవర్‌ కమిటీ చర్చించింది. ప్రమాదం జరిగిన తీరు, భవిష్యత్‌లో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను కమిటీ ఇవ్వనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement