అభిమాని కుటుంబానికి రూ. 2 లక్షలు | hero ram charan announces rs 2 lakh for dead fan kin | Sakshi
Sakshi News home page

అభిమాని కుటుంబానికి రూ. 2 లక్షలు

Oct 1 2014 7:14 PM | Updated on Jul 14 2019 1:57 PM

అభిమాని కుటుంబానికి రూ. 2 లక్షలు - Sakshi

అభిమాని కుటుంబానికి రూ. 2 లక్షలు

తన సినిమా చూసేందుకు వచ్చి మృత్యువాత పడిన అభిమానిని ఆదుకునేందుకు హీరో రామ్చరణ్ ముందుకు వచ్చారు.

హైదరాబాద్: తన సినిమా చూసేందుకు వచ్చి మృత్యువాత పడిన అభిమానిని ఆదుకునేందుకు హీరో రామ్చరణ్ ముందుకు వచ్చారు. 'గోవిందుడు అందరివాడేలే' సినిమా చూడానికి వెళ్లి కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో కన్నయ్య అనే అభిమాని మృతి చెందాడు. స్థానిక శివ థియేటర్ లో టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో అతడు ప్రాణాలు కోల్పోయాడు.

కన్నయ్య మృతి పట్ల రామ్చరణ్ సంతాపం ప్రకటించారు. అతడి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. అతడి కుటుంబానికి రూ.2 లక్షలు ఎక్స్గ్రేషియా అందిస్తామని తెలిపారు. ఈమేరకు రామ్చరణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ధియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే కన్నయ్య చనిపోయాడని అభిమానులు విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement