ప్రణీత, నిఖిల్‌ సందడి | hero nikhil and praneetha visit nandyal town | Sakshi
Sakshi News home page

ప్రణీత, నిఖిల్‌ సందడి

Nov 3 2017 10:21 AM | Updated on Nov 3 2017 10:21 AM

hero nikhil and praneetha visit nandyal town - Sakshi

షాపింగ్‌ మాల్‌లో వస్త్రాలను ప్రదర్శిస్తున్న ప్రణీత, చిత్రంలో నిఖిల్

నంద్యాలటౌన్‌: నంద్యాల పట్టణంలో గురువారం సినీ హీరో నిఖిల్, హీరోయిన్‌ ప్రణీత సందడి చేశారు. పట్టణంలో మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేసిన అతి  పెద్ద వీరభద్రస్వామి షాపింగ్‌ మాల్‌ను వీరు ప్రారంభించారు. కార్యక్రమానికి సినీ నటులు వస్తున్నారనే సమాచారం మేరకు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మధ్యాహ్నం 12గంటల సమయంలో వీరు నంద్యాలకు చేరుకొని అభిమానుల్లో ఉత్సాహం నింపి అనంతరం మాల్‌ ప్రారంభించారు. వారు షాపింగ్‌ మాల్‌ అంతా కలియ తిరుగుతూ దుస్తులను  ప్రదర్శించారు. మొట్టమొదటి సారిగా హైదరాబాద్‌ సిటీ తరహాలో షాపింగ్‌మాల్‌ను ఏర్పాటు చేశామని అధినేత పవన్‌ తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్, తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement