తిరుమల ఘాట్‌లో విరిగిన కొండచరియలు | Heavy traffic due to Landslides on Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమల ఘాట్‌లో విరిగిన కొండచరియలు

Nov 18 2013 1:04 AM | Updated on Sep 2 2017 12:42 AM

తిరుమల ఘాట్‌లో విరిగిన కొండచరియలు

తిరుమల ఘాట్‌లో విరిగిన కొండచరియలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనద్రోణి ప్రభావం కారణంగా ఆదివారం రాయలసీమలో ఓ మోస్తరు వర్షం కురిసింది.

సాక్షి,తిరుమల: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనద్రోణి ప్రభావం కారణంగా ఆదివారం రాయలసీమలో ఓ మోస్తరు వర్షం కురిసింది. తిరుమలలో రెండు రోజులుగా వర్షం కుస్తుండడంతో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఉదయం 7.20గంటల ప్రాంతంలో చివరి మలుపు వద్ద సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు పడ్డాయి. ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బండరాళ్లు రోడ్డుపై పడిపోవడంతో ఘాట్‌రోడ్డులో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సిబ్బంది కూలీల సహాయంతో రోడ్డుపై పడిన బండరాళ్లను తొలగించి వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement