ఇరవై రోజుల్లో పెళ్లిపీటల మీద కూర్చోవాల్సిన యువకుడు శవంగా మారాడు. దీనికి కారణం వైద్యం వికటించడమేనని బాధితుడి బంధువులు ఆరోపిస్తుండగా, వైద్యంలో ఏ లోపమూ లేదని డాక్టర్లు అం టున్నారు.
=20 రోజుల్లో పెళ్లి..
=ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన, ఉద్రిక్తత
మదనపల్లె రూరల్, న్యూస్‌లైన్: ఇరవై రోజుల్లో పెళ్లిపీటల మీద కూర్చోవాల్సిన యువకుడు శవంగా మారాడు. దీనికి కారణం వైద్యం వికటించడమేనని బాధితుడి బంధువులు ఆరోపిస్తుండగా, వైద్యంలో ఏ లోపమూ లేదని డాక్టర్లు అం టున్నారు. బుధవారం రాత్రి మదనపల్లెలో ఈ సంఘటన ఉద్రిక్తత కలిగించింది.
వివరాలు.. పట్టణంలోని ఎగువకురవంకకు చెందిన ఎస్.జార్‌వల్లి కుమారుడు షాహీదావల్లి(26) నాలుగేళ్లుగా సౌదీలో ఉంటూ నెలరోజుల క్రితం మదనపల్లెకు వచ్చాడు. బాడుగ ఆటో నడుపుతూ తల్లి రఫిక్‌ఉన్నీషాతో ఉంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం కడుపు నొప్పిగా ఉందని చెప్పడంతో ఇంటికి దగ్గరగా ఉన్న ఓ ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు తల్లి తీసుకువెళ్లింది. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం స్థానిక ఏరియా ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఓ ప్రయివేట్ ఎమర్జెన్సీ ఆస్పత్రికి మధ్యాహ్నం ఒక గంటకు నడిపించుకుని వచ్చారు.
షాహీదావల్లికి రాత్రివరకు చికిత్స చేశారు. రాత్రి ఎనిమిదిగంటల ప్రాంతంలో ఓ ఇంజక్షన్‌ను గుండెకు సమీపంలో వేయడంతో, అంతవరకు బాగా మాట్లాడుతున్న యువకుడికి నోటమాటపడిపోరుుంది. క్షణాల్లో అతని ప్రాణం గాల్లో కలసిపోయింది. వి షయం తెలుసుకున్న తల్లితండ్రులు, బంధువులు డాక్టర్‌తో వాగ్వివాదానికి దిగారు. వచ్చీరాని వైద్యంచేసి చంపేశారని గొడవచేశారు. ఆస్ప త్రి ఎదుట మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న ఒకటవ పట్టణ ఎస్‌ఐ మల్లికార్జున సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్నవారిని చెదరగొట్టారు.
వైద్యులు, బంధువులతో మాట్లా డి మృతికి గల కారణాలపై ఆరాతీశారు. అదేసమయంలో పట్టణంలోని ప్రవేట్‌వైద్యుల బృందం అక్కడికి చేరుకుని యువకుని మృతికి డాక్టర్ ఇచ్చిన వైద్యానికి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. కావాలంటే ఎక్కడైనా గుండె చికి త్స నిపుణులతో పరీక్ష చేయించుకోవచ్చని, వైద్యంలో లోపం ఉం దని తేలితే ఎలాంటి చర్యలకైనా సిద్ధమన్నా రు.
చేసేది లేక శవాన్ని తీసుకుని బాధితులు ఇంటి ముఖం పట్టారు. కాగా, షాహీదావల్లి కి ఇరవై రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉందని తల్లి కన్నీరు మున్నీరుగా విలపించడం అక్కడి వా రి హృదయాలను కలిచివేసింది. షాహీదావల్లి మృతిపై ఆస్పత్రి డాక్టర్ జి.దీపను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా, తీవ్ర గుండె జ బ్బుతో ఆస్పత్రికి వచ్చాడని తెలిపారు. ఇంజ క్షన్ వికటించడం వల్లనే చనిపోయాడన్నది వాస్తవం కాదని తెలిపారు.