
కారు ప్రమాదం నుంచి బయటపడ్డ హంసా నందిని
సినీనటి హంస నందిని కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించకున్నారు.
సినీనటి హంస నందిని కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించకున్నారు. వైఎస్ఆర్ జిల్లా నుంచి హైదరాబాద్ కు ప్రయాణిస్తున్న హంసానందిని కారు సోమవారం రాత్రి మహబూబ్ నగర్ వద్ద ప్రమాదానికి గురైంది.
హంసా నందిని ప్రయాణిస్తున్న కారు హై వేలో అదుపుతప్పి బారికేడ్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కడపలో ఓ కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో హంసానందిని, ఆమె కారు డ్రైవర్ స్వల్పంగా గాయపడినట్టు తెలిసింది.