తిరుమలలో ‘వరుణ జపం’ | Hailstroms at Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో ‘వరుణ జపం’

Apr 26 2015 2:09 AM | Updated on Sep 3 2017 12:52 AM

తిరుమలలో ‘వరుణ జపం’

తిరుమలలో ‘వరుణ జపం’

తిరుమలలో శనివారం వడగళ్ల వాన కురిసింది.

తిరుమలలో శనివారం వడగళ్ల వాన కురిసింది. మధ్యాహ్నం 12 నుంచి రెండు గంటల వరకు భారీ వర్షం పడింది. ఆలయంలోని ఆనంద నిలయం చుట్టూ, పడివాకిలి తర్వాత కూడా వర్షపు నీరు నిలిచింది. అప్రమత్తమైన ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డి ఫైరింజన్‌ను రప్పించారు. ప్రత్యేకంగా మోటార్లు అమర్చి పైపుల సాయంతో ఆలయంలో నిలిచిన వర్షపు నీటిని తొలగించారు. కొద్దిసేపు భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించలేదు. తర్వాత భక్తులను స్వామి దర్శనానికి అనుమతించారు. వర్షానికి ఈదురుగాలులు తోడవ్వడంతో రెండో ఘాట్‌లో పలుచోట్ల చిన్నపాటి కొండ చరియలు విరిగిపడ్డాయి.
- సాక్షి, తిరుమల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement