జీజీహెచ్‌ వైద్య సిబ్బంది నిరసన

Guntur GGH Staff Protest - Sakshi

సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన

మూడేళ్లుగా పట్టించుకోని అధికారులు

సూపరింటెండెంట్‌ తీరుపై విమర్శలు

గుంటూరు మెడికల్‌: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో పనిచేస్తున్న నాల్గోతరగతి ఉద్యోగులు గురువారం సూపరింటెండెంట్‌ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఆస్పత్రిలో మూడేళ్లుగా నాల్గో తరగతి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా ఆస్పత్రి అధి కారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. పలుమార్లు వినతిపత్రాలు అందజేసి, సమ్మె నోటీసులు ఇచ్చినా తమ సమస్యలపై ఏ మాత్రం చిత్తశుద్ధి చూపించటం లేదన్నారు.  మూడు రోజులపాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించి అధికారులు స్పందించని పక్షంలో ఈనెల 12 నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తామని వెల్లడిం చారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ పనితీరుపై జి ల్లా కలెక్టర్‌కు, ముఖ్యమంత్రిగా ఫిర్యాదు చేస్తామ ని యూనియన్‌ నేతలు తెలిపారు. శుక్రవారం కూ డా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు నిరసన కార్యక్రమాలు జరుగుతాయన్నారు.

ఉద్యోగుల డిమాండ్లు...
ఉద్యోగులకు ప్రత్యేక క్లినిక్‌లో మందులు సరిపడా ఇవ్వటంలేదు. నెలకు ఒకసారి మెడికల్‌ చెకప్‌ చేయించి మందులు అందజేయాలి. చనిపోయిన, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల్లో పలువురికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలు త్వరగా అందించాలి. నాల్గో తరగతి ఉద్యోగులకు జూనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇవ్వాలి. సీనియారిటీ లిస్ట్‌లు ఇవ్వాలి.  ఉద్యోగుల మెడికల్‌ లీవ్, ఎరన్డ్‌ లీవ్, ఇంక్రిమెంట్ల బిల్లులు ట్రెజరీకి పంపినప్పుడు ఉద్యోగులకు సమాచారం ఇవ్వాలి. యూనియన్‌ ఆఫీకు మరమ్మతులు చేయిం చాలి. ఉద్యోగుల సెలవుల మంజూరు విషయంలో జాప్యం లేకుం డా చూడాలి. ఏడాదికి ఒకసారి ఉద్యోగులకు సర్వీస్‌ రిజిస్టర్‌ జిరాక్స్‌ కాపీలను అందజేయాలి.

నిరసనలో పాల్గొన్న నేతలు
ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(ఏఐటీయూసీ) జీజీహెచ్‌శాఖ కార్యదర్శి వడ్డే బా లయ్య, అధ్యక్షుడు సీహెచ్‌ వీరరాఘవులు, కోశాధికారి కె. వెంకటకృష్ణ, గౌరవ అధ్యక్షుడు కోట మాల్యాద్రి, జిల్లా మహిళా కార్యదర్శి కోలా స్వాతి, రావుల అంజిబాబు, కె. రమేష్‌బాబు, కె. దుర్గాప్రసాద్, పి. నాగరాజు  పాల్గొన్నారు.

జీజీహెచ్‌లో పారితోషికాలుఇవ్వకపోతే ఎలా?
గుంటూరు మెడికల్‌:గుంటూరు జీజీహెచ్‌లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది గురువారం ఆస్పత్రి అసిస్టెంట్‌ డైరక్టర్‌ మాజేటి రత్నరాజును కలిసి తమకు ఏడు నెలలుగా ఆరోగ్యశ్రీ పారితోషికాలు ఇవ్వటం లేదని ఫిర్యాదు చేశారు. పారితోషికాలు నిలిపివేయటానికి గల కారణాలు తమకు తెలియజేయాలని కోరారు. పారితోషికాలు నిలిపివేయటం వల్ల తాము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు. గతంలో పారితోషికాల కోసం ఓ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేస్తే ఇచ్చారనే విషయాన్ని గుర్తు చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు పారితోషికాలు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన నాటి నుంచి తమకు పారితోషికాలు నిలిపివేయటంపై ఉద్యోగులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కార్యాలయ ఉద్యోగుల పనితీరు వల్లే తమకు పారితోషికాలు రావటం లేదని తక్షణమే ఏడునెలల బకాయిలు ఇప్పించాలని అసిస్టెంట్‌ డైరక్టర్‌ను కోరారు. నిధుల కొరత వల్లే పారితోషికాలు ఇవ్వటం లేదని రత్నరాజు చెప్పి నిధులు రాగానే పారితోషికాలు చెల్లిస్తామని వైద్య సిబ్బందికి హామీ ఇచ్చారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top