2011 జనాభా లెక్కల మేరకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) జనాభా 67,31,790. ప్రస్తుతం అది 71,70,545కు చేరింది.
	625 చ.కి.మీల నుంచి 922 చ.కి.మీలకు పెరిగిన విస్తీర్ణం
	 67.31 లక్షల నుంచి 71.70 లక్షలకు చేరిన జనాభా
	 మారిన గ్రేటర్ ముఖచిత్రం
	 శంషాబాద్ విమానాశ్రయం నుంచి జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు దాకా విస్తరణ..!
	   సాక్షి, సిటీబ్యూరో: 2011 జనాభా లెక్కల మేరకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) జనాభా 67,31,790. ప్రస్తుతం అది 71,70,545కు చేరింది. శివార్లలోని 35 పంచాయతీల విలీనంతో అదనంగా 4,38,755 జనాభా కూడా గ్రేటర్ పరిధిలోకి వచ్చింది. విస్తీర్ణం 625 చ .కి.మీల నుంచి 922 చ.కి.మీలకు పెరిగి, నగర ముఖచిత్రం మారిపోయింది. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల నాటికి డివిజన్ల పునర్వ్యవస్థీకరణ తప్పనిసరి కానుంది. ప్రస్తుతమున్న 150 డివిజన్ల సంఖ్యలో మార్పు లేనప్పటికీ.. జనాభా కనుగుణంగా డివిజన్లను హేతుబద్ధీకరించనున్నారు.

	 కోర్ ఏరియా(పాత ఎంసీహెచ్)పరిధిలో  వంద, శివార్లలో 50 డివిజన్లుండగా.. పునర్వ్యవస్థీకరణతో  కోర్‌ఏరియాలో 75, శివార్లలో 75 డివిజన్లు రాగలవని అంచనా. సర్కిళ్లు, డివిజన్లు, ఆయూ డివిజన్లో జనాభాను వీటన్నింటినీ హేతుబద్ధం చేసి,  ఒక్కో సర్కిల్‌లో రెండున్నర లక్షల జనాభాతో 30 సర్కిళ్లు ఏర్పాటు చేయునున్నారు. ప్రసాదరావు కమిటీ సిఫార్సుల మేరకు ప్రస్తుతమున్న 18 సర్కిళ్లను 30కి పెంచేందుకు అనుగుణంగా చర్యలు చేపడతారు. ఒక్కో సర్కిల్ మినీ కార్పొరేషన్‌గా మారనుంది. ఇప్పటి ఐదు జోన్లలో మార్పు లేకున్నా, ఒక్కో జోన్ పరిధిలో ఆరు సర్కిళ్ల వంతున ఉంటాయి. వూరిన వ్యవస్థలో జోనల్ కమిషనర్లు డిప్యూటీ కమిషనర్లుగా వ్యవహరిస్తారు.
	 
	 యాభైవేల జనాభాకో డివిజన్..
	 గ్రేటర్‌లో ఇక 50వేల జనాభాకు ఒక డివిజన్ ఉంటుంది. పరిపాలనలో ఇబ్బందులెదురవకుండా సర్కిళ్లలో అన్ని విభాగాల్లో తగిన సిబ్బందిని నియమిస్తావుని జీహెచ్‌ఎంసీ కమిషనర్ కృష్ణబాబు తెలిపారు. ఇంజనీరింగ్ ఏఈలు, పారిశుధ్యంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, టౌన్‌ప్లానింగ్‌లో బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్, ఘనవ్యర్థాల నిర్వహణలో ఏఈ.. ఇలా అన్ని  ముఖ్యవిభాగాల అధికారులు డివిజన్‌స్థాయిలోనే ఉంటారని, 150 డివిజన్ కార్యాలయాల నుంచే వీరు విధులు నిర్వహిస్తారని కృష్ణబాబు చెప్పారు.