
పీసీపల్లి: 104లో పనిచేస్తున్న ఉద్యోగులు జీతాలు చాలక చాలా ఇబ్బందులు పడుతున్నారని అద్దంకి డివిజన్ 104 నాయకుడు శేషు జగన్‌ను కలసి విన్నవించారు. ఎంతోకాలం నుంచి పనిచేస్తున్నా ఉద్యోగభద్రత లేదని తెలిపారు. జీతాలు పెంచేలా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని కోరారు. – శేషు
రాఖీ కట్టిన మహిళలు
ఉలవపాడు: వెంకటాపురం గ్రామానికి చెందిన ఐదుగురు మహిళలు జగన్‌కు రాఖీ కట్టారు. ప్రజా సంకల్పయాత్రలో ఉన్న జగన్‌ను కలసిన యమ్.అంజమ్మ, అనసూర్య, జ్యోతి, రమ, అంజమ్మలు సోదరబావంతో రాఖీ కట్టినట్లు తెలిపారు. – రాఖీలు కట్టిన మహిళలు
వైఎస్ దయ వల్లే బతికాను...
ఉలవపాడు: వైఎస్ రాజశేఖరరెడ్డి దయ వల్లే నేను ఈ రోజు బతికి ఉన్నానని అలవలపాడు కుచెందిన జాన్ సైదా జగన్‌ను కలసి తెలిపారు. మొదట మెదడువాపు వ్యాధి వచ్చిందని, తరువాత బ్రెయిన్ టీబీ వచ్చిందిని చెప్పారు. అందరూ నన్ను చనిపోతారు అనుకున్న పరిస్థితుల్లో వైఎస్సార్ దయ వల్ల ఆపరేషన్లు చేయించుకుని బతికానన్నారు. ప్రస్తుతం మందులకు నెలకు రూ. 5 వేలు పైనే అవుతున్నాయని ఉచితంగా వచ్చేలా చూడాలని జగన్ ను కలసినట్లు తెలిపారు. – జాన్ సైదా