
సాక్షి, హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రధాన అర్చకుడిగా తన నియామకాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలయ్యే అవకాశం ఉందని.. అందువల్ల తన వాదనలు వినకుండా ఆ పిటిషన్‌లో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరుతూ గోవిందరాజ దీక్షితులు హైకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. 65 ఏళ్లు దాటిన అర్చకులను టీటీడీ అధికారులు ఇటీవల పదవీ విరమణ చేయించారని, ఈ నేపథ్యంలో ప్రధాన అర్చకుడిగా తన నియామకాన్ని సవాలు చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. పదవీ విరమణ చేసిన నరసింహ దీక్షితులు తనపై పిటిషన్ దాఖలు చేస్తారని, అందువల్ల తన వాదన వినకుండా ఉత్తర్వులు జారీ చేయవద్దని కోర్టును అభ్యర్థించారు.