పర్యావరణాన్ని పరిరక్షిస్తూ.. పారిశ్రామిక కారిడార్‌

Government Is Preparing The Sector For The Supply Of land And Water Needed For Setting Up Industries In The Chittoor District - Sakshi

పరిశ్రమల ఏర్పాటుకు వ్యాపారుల ఆసక్తి

24వేల ఎకరాల భూసేకరణకు రెవెన్యూ కసరత్తు

చెరువులు, రెండు పంటలు పండే భూముల జోలికి వెళ్లరు

భూములు ఇచ్చే వారికి పరిహారం.. ఇంటికో ఉద్యోగం

అవినీతి అక్రమాలకు తావు లేకుండా.. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ నూతన పారిశ్రామిక కారిడార్‌కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా భూసేకరణకు ప్రయత్నాలు ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో భూ సేకరణలో పెద్దఎత్తున అవినీతి అక్రమాలు చోటుచేసుకోవడంతో పాత విధానానికి స్వస్తిపలికి.. నూతన పారిశ్రామిక విధానానికి కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు, రహదారి సౌకర్యం, రైల్వే మార్గం, నీటి సౌకర్యం, ఆకాశ మార్గంలో రాకపోకలకు అనుకూలంగా రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్ర యం, జిల్లాకు అతి సమీపంలో సముద్రతీర ప్రాంతం ఉండటంతో పారిశ్రామిక వేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులతో రావడానికి ఆసక్తిచూపుతున్నారు.

సాక్షి, తిరుపతి: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు, నీటి సరఫరాకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, బుచ్చినాయు డు కండ్రిగ మండలాల పరిధిలోని మొ త్తం 34 గ్రామాల్లో విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతంగా గుర్తించినట్లు తెలిసింది. అందుకు అవసరమైన భూముల సేకరణకు జిల్లా అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్త ఆదేశాల మేరకు తిరుపతి ఆర్డీఓ కనకనరసారెడ్డి ఆధ్వర్యంలో 40 మందితో కూడిన బృందం క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. ఈ బృందాన్ని ఉత్తర, దక్షిణ విభాగాలుగా విభజించారు. ఉత్తరంలో 11వేల ఎకరాలు, దక్షిణంలో 13వేల ఎకరాలను సేకరించనున్నారు.

పర్యావరణానికి ముప్పు లేకుండా జాగ్రత్తలు
పర్యావరణానికి ముప్పు వాటిల్ల్ల కుండా ఎక్కడా చెరువుల జోలికి వెళ్లకుండా జనావాసానికి ఎటువంటి ఆటం కాలూ లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. అదేవిధంగా రెండు పంటలు పండే భూములను కూడా తీసుకోవద్దని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. రెండు పంటలు పండే భూములకు కండలేరు జలాశయం నుంచి 6 టీఎంసీల నీటిని సరఫరా చేసేం దుకు ప్రభుత్వ యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. భూములు ఇచ్చే రైతులకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం రూ.1,507 కోట్లు కేటాయించినట్లు ఆర్డీఓ కనకనరసారెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో పరిహారం పంపిణీలో జరిగిన అవకతవకల నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం నేరుగా రైతులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించనుంది. భూములకు సంబంధించిన పత్రాలు పరిశీలించి, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన తర్వాతే పరిహారం పంపిణీ చెయ్యనుంది. దీంతో పరిహారం పంపిణీలో అవకతవకలు జరిగే అవకాశాలు ఉం డవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.  విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు పూర్తయితే శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు దొరికే పరిస్థితులు ఉన్నాయి.

సీఎం సాహసోపేత నిర్ణయం 
స్థానికులకు 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చట్టం చెయ్యడం సాహసోపేత నిర్ణయం. సీఎం తీసుకున్న నిర్ణయంతో నియోజకవర్గంలో అనేకమంది నిరుద్యోగ యువతకు ఎంతో మేలు చేకూరనుంది. ముఖ్యంగా వారి కుటుం బాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది.
– బియ్యపు మధుసూదన్‌ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top