సాక్షి స్పెల్‌బీకి విశేష స్పందన | good response to sakshi spell b | Sakshi
Sakshi News home page

సాక్షి స్పెల్‌బీకి విశేష స్పందన

Dec 16 2013 3:01 AM | Updated on Sep 2 2017 1:39 AM

ఇండియా స్పెల్‌బీ ఆధ్వర్యంలో నగరంలోని ఐరిస్‌వరల్డ్ స్కూల్‌లో ఆదివారం జరిగిన స్పెల్‌బీ జోనల్ రౌండ్ పరీక్షకు విశేష స్పందన వచ్చింది

 సప్తగిరికాలనీ (కరీంనగర్ జిల్లా), న్యూస్‌లైన్ :
 సాక్షి, ఇండియా స్పెల్‌బీ ఆధ్వర్యంలో నగరంలోని ఐరిస్‌వరల్డ్ స్కూల్‌లో ఆదివారం జరిగిన స్పెల్‌బీ జోనల్ రౌండ్ పరీక్షకు విశేష స్పందన వచ్చింది. అక్షరదోషాలు లేకుండా ఆంగ్ల పదాలు రాయడం.. వాటిని ఎలా పల కాలో క్లుప్తంగా వివరించడం.. కొత్త ఆంగ్ల ప దాలు విద్యార్థులకు పరిచయం చేయడానికి సాక్షి, ఇండియాస్పెల్ ఆధ్వర్యంలో స్పెల్‌బీ ప రీక్షను దేశమంతటా నిర్వహిస్తోంది. ఇందు లో భాగంగా ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ రౌండ్‌లో విజేతలకు జోనల్‌స్థాయిలో పరీక్ష నిర్వహించారు. దీనికి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. కేటగిరీ-1లో ఒక టి, రెండో తరగతి, కేటగిరీ-2లో మూడు, నాలుగు, కేటగిరీ-3లో ఐదు నుంచి ఏడు, కేటగిరీ-4లో ఎనిమిది నుంచి పదో తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. మొత్తం 211 మంది హాజరుకాగా.. ‘సాక్షి’ టీవీ లైవ్ ద్వారా హైదరాబాద్ నుంచి ప్రశ్నలు వేశారు. వాటికి అక్షరదోషాలు లేకుండా విద్యార్థులు పదాలు రాశారు. లైవ్ ద్వారా పరీక్ష కావడంతో చిన్నారులు సంతోషంగా పాల్గొన్నారు. పరీక్షను సాక్షి రీజనల్ మేనేజర్ ఎస్.శ్రీనివాస్, ఐరిస్, పారమిత విద్యాసంస్థల అధినేత ప్రసాద్‌రావు పర్యవే క్షించారు. కార్యక్రమంలో సాక్షి డిప్యూటీ మేనేజర్ సంపత్‌కుమార్, ఇండియా స్పెల్‌బీ ప్రతినిధి సాయినాథ్‌రెడ్డి, ఐరిస్ పాఠశాల ప్రిన్సిపాల్ స్వరూప్‌దత్త పాల్గొన్నారు.
 
 స్పెల్లింగ్స్ తెలిశాయి
 లైవ్‌లో వారు ప్రశ్నలు అడుగుతుంటే ఇంగ్లిష్‌లో ఇన్ని పదాలు ఉన్నాయా..! అని అనిపిం చింది. లెసన్స్‌లో ఉన్న వర్డ్స్ మాత్రమే మాకు తెలుసు. స్పెల్‌బీతో చాలా పదాలకు స్పెల్లింగ్స్ తెలిశాయి. వాటిని ఎలా పలకాలో కూడా చెప్పారు. కార్యక్రమం చాలా బాగుంది.
 - పవార్ కృప నక్షత్ర, ఆర్మూర్
 
 పదాలు పలకడం నేర్చుకున్నాం
 ఇంగ్లిష్ అంటే చాలాఇష్టం. కొత్త పదాలు తెలుకోవాలని ఎప్పుడూ అనుకుంటా. స్పెల్‌బీ పరీక్ష చాలా బాగుంది. తెలిసిన పదాలే.. వాటిని ఇంతకుముందు వేరేలా పలి కాం. ఇప్పుడు వాటిని ఎలా పలకాలో తెలుసుకున్నాం. ఐ లైక్‌వెరీ మచ్. ఆల్‌ఆర్ మస్ట్ రైట్ దిస్ ఎగ్జామ్.
 - సంయుక్త, నిజామాబాద్
 
 విద్యార్థుల ప్రతిభ తెలుస్తుంది
 ఆంగ్లంలో విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి సాక్షి స్పెల్‌బీతో ముందుకురావడం అభినందనీయం. విద్యార్థుల మధ్య ఆరోగ్యవంతమైన పోటీ ఏర్పడుతుంది. మా ఐరిస్ సంస్థలోనే పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉంది. ఇలాంటివి మరిన్ని నిర్వహించాలి.
 - ప్రసాదరావు, ఐరిస్, పారమిత విద్యాసంస్థల అధినేత
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement