స్పెల్లింగ్‌ కింగ్స్‌ | Summer Spelling Activities for Kids to Prevent Learning Loss | Sakshi
Sakshi News home page

స్పెల్లింగ్‌ కింగ్స్‌

May 8 2026 6:08 AM | Updated on May 8 2026 6:08 AM

Summer Spelling Activities for Kids to Prevent Learning Loss

కిడ్స్‌ కార్నర్‌

ఫ్రెండ్స్, మీరు న్యూస్‌పేపర్స్‌లో, టీవీలో స్పెల్‌ బీ విన్నర్స్‌ గురించి చదివి ఉంటారు. విని ఉంటారు. సెకన్‌ల టైమ్‌లోనే రకరకాల వర్డ్స్‌ స్పెల్లింగ్‌లను తప్పు లేకుండా చెప్పి ‘వావ్‌’ అనిపిస్తారు. బృహత్‌ సోమ పేరు మీరు వినే ఉంటారు. పన్నెండేళ్ల సోమ ‘యూఎస్‌ స్పెల్లింగ్‌ బీ’ పోటీలో విన్నర్‌. 90 సెకన్‌లలో 29 పదాల స్పెల్లింగ్‌లను కరెక్ట్‌గా చెప్పాడు. 50 వేల డాలర్ల బహుమతి గెలుచుకున్నాడు. 

విన్నర్స్‌ టాలెంట్‌ను చూసి ‘వావ్‌’ అనడం బానే ఉంటుంది. మరి మీకు వారిలా పేరు తెచ్చుకోవాలని లేదా! మేడ పైకి వెళ్లాలంటే, ఒక్కసారిగా వెళ్లలేము కదా... మనకు రెక్కలు లేవు కదా! ఒక్కోమెట్టు ఎక్కుతూ వెళ్లాలి. స్పెల్లింగ్‌ బీ కూడా అంతే. ఈ సమ్మర్‌ హాలిడేస్‌లో మెల్లగా ప్రాక్టిస్‌ మొదలుపెట్టండి. ప్రాక్టిస్‌ చేయగా... చేయగా... తప్పనిసరిగా ‘స్పెల్‌ బీ పోటీ’లో పేరు తెచ్చుకుంటారు...

ప్రయోజనం ఏమిటి?
స్పెల్‌ బీ పోటీల వల్ల కప్పులు గెలుచుకుంటామా లేదా అనేది వేరే విషయం. ఈ పోటీల కోసం ప్రాక్టిస్‌ చేయడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటంటే...

లాంగ్వేజ్‌ స్కిల్స్‌...
మనకు ఎన్ని ఎక్కువ పదాలు తెలిస్తే అంత మంచిది. లాంగ్వేజ్‌ స్కిల్స్‌ను డెవలప్‌ అవుతాయి.

మెరుగైన ఉచ్ఛారణ: పదాలను ఎలా సరిగ్గా పలకాలో తెలుస్తుంది. లాంగ్వేజ్‌ రూల్స్‌పై అంతకంతకూ అవగాహన పెరుగుతుంది.

మెమొరీ పవర్‌: స్పెల్‌ బీ పోటీలకు ప్రిపేర్‌ కావడం ద్వారా మెమొరీ పవర్, ఏకాగ్రత, సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ పెరుగుతాయి.

స్ట్రెస్‌ ఫ్రీ: స్పెల్‌ బీ పోటీల్లో పాల్గొనడం ద్వారా ఒత్తిడి తట్టుకునే, నలుగురిలో ధైర్యంగా, స్పష్టంగా మాట్లాడే విధానం అలవడుతుంది.

స్టడీ డిసిప్లిన్‌: చదువుకు క్రమశిక్షణ చాలా ముఖ్యం కదా... మరి స్పెల్‌ బీ పోటీల కోసం రెగ్యులర్‌గా ప్రిపేర్‌ కావడం వల్ల స్టడీ డిసిప్లిన్‌ పెరుగుతుంది.

సోషల్‌ ఇంటరాక్షన్‌: స్పెల్‌ బీ పోటీల వల్ల సోషల్‌ ఇంటరాక్షన్‌ పెరుగుతుంది. మీలాంటి మంచి హాబీస్‌ ఉన్న పిల్లలతో స్నేహం పెరుగుతుంది. ఇలా ఫ్రెండ్‌షిప్‌ పెరగడం ద్వారా ఎప్పటికప్పుడూ కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి. వారికి తెలియనిది మీరు చెబుతుంటారు, మీకు తెలియనిది వారు చెబుతుంటారు.

బెస్ట్‌ స్పెల్లర్స్‌ ఎవరంటే...
బెస్ట్‌ స్పెల్లర్స్‌ అంటే డిక్షనరీలో ప్రతి పదాన్ని బట్టీ పట్టేవారు కాదు. డౌటుగా ఉన్నప్పుడు కూడా కరెక్ట్‌గా చెప్పిన వారే... బెస్ట్‌ స్పెల్లర్స్‌. చాంపియన్‌ స్పెల్లర్స్‌ తమ ఎమోషన్స్‌ను కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఒక్కసారి ఊహించుకోండి. మీరు ఇంతకు ముందెన్నడూ వినని పదం మీకు రావచ్చు. వాచ్‌లో సెకన్‌ల టైమ్‌ మాత్రమే ఉండగా, లక్షలాది ప్రేక్షకులు మీ జవాబు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా టెన్షన్‌గా ఉండొచ్చు. ఒత్తిడిగా అనిపించవచ్చు. అయితే చాంపియల్‌ స్పెల్లర్స్‌ ఈ సమయంలోనూ కూల్‌గా ఉండడం నేర్చుకోవాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement