రోడ్‌షోకు అపూర్వ స్పందన | good response for Road show | Sakshi
Sakshi News home page

రోడ్‌షోకు అపూర్వ స్పందన

Mar 2 2014 3:58 AM | Updated on Aug 8 2018 5:33 PM

వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి తిరుపతి ప్రజలు నీరాజనం పలికారు. శనివారం వైఎస్‌ఆర్ జనభేరి, ఓదార్పు కార్యక్రమాలకు హాజరైన ఆయనకు అడుగడుగునా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.

సాక్షి, తిరుపతి: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి తిరుపతి ప్రజలు నీరాజనం పలికారు. శనివారం వైఎస్‌ఆర్ జనభేరి, ఓదార్పు కార్యక్రమాలకు హాజరైన ఆయనకు అడుగడుగునా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో తిరుపతి చేరుకున్న వైఎస్ జగన్ 9.30 గంటలకు లక్ష్మీపురం సర్కిల్ నుంచి రోడ్‌షో ప్రారంభించారు.
 
 సాయంత్రం వరకూ సాగిన రోడ్‌షోలో ఒక్కొక్క జంక్షన్ దాటేందుకు గంటకు పైగా పట్టింది. పలువురు మహిళలు, విద్యార్థులు జననేతను చూసేందుకు, కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. జ్యోతి థియేటర్ సర్కిల్ వద్ద జ్యోతిరావు పూలే చిత్రపటానికి జగన్ నివాళులర్పించారు. సాయంత్రం 5.30 గంటలకు లీలామహల్ సర్కిల్ వద్ద ఏర్పాటుచేసిన వైఎస్సార్ జనభేరిలో ప్రసంగించారు.
 
వైఎస్‌ మరణం తట్టుకోలేక ప్రాణాలొదిలిన తిరుమలకు చెందిన కొప్పల శంకర్ కుటుంబాన్ని, రాఘవేంద్ర నగర్‌లో ఓబులప్ప శ్రీనివాసులు కుటుంబాన్ని ఓదార్చారు. రోడ్‌షో ప్రారంభం నుంచి ముగిసేవరకు జగన్ వెంట ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, శ్రీకాం త్‌రెడ్డి, శ్రీనివాసులు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.నారాయణస్వామి, రాజంపేట పార్లమెంటరీ స్థానం పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్ సమక్షంలో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే జయదేవనాయుడు వైఎస్సార్ సీపీలో చేరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement