
ఏఆర్‌ఎస్‌ఐ అప్పలనరసింహాచారిని సన్మానిస్తున్న ఎస్పీ
శ్రీకాకుళం సిటీ : ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ సర్వ సాధారణమని, ప్రజాసేవలో పనిచేయడం అందరి అదృష్టంగా భావించాలని జిల్లా ఎస్పీ సీఎం త్రివిక్రమవర్మ అన్నారు. జిల్లా పోలీస్ సమావేశ మందిరంలో సోమవారం ఎచ్చెర్ల సాయుధ దళ ఏఆర్‌ఎస్‌ఐ పైడిపాటి అప్పలనరసింహాచారి పదవీవిరమణ అభినందన కార్యక్రమంలో ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1979వ సంవత్సరంలో కానిస్టేబుల్‌గా పోలీస్‌శాఖలో చేరి ఏఆర్‌ఎస్‌ఐ స్థాయికి ఎదిగిన అప్పలనరసింహాచారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి, డీఎస్పీలు జి.చంద్రబాబు, ఎల్‌వీ శ్రీనివాసులు, సీఐ జి.శ్రీనివాసరావు, ఏఆర్ ఆర్‌ఐ డి.కోటేశ్వరరాబాబు, పోలీస్ అధికారుల సంఘం ప్రెసిడెంట్ కె.అప్పన్న, తదితరులు పాల్గొన్నారు.