కార్యకర్తలకు అండగా ఉంటాం | gives full support to party activist | Sakshi
Sakshi News home page

కార్యకర్తలకు అండగా ఉంటాం

Sep 29 2014 11:54 PM | Updated on Sep 3 2019 8:53 PM

కార్యకర్తలకు అండగా ఉంటాం - Sakshi

కార్యకర్తలకు అండగా ఉంటాం

కార్యకర్తలందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, గ్రామ స్థాయి నుంచీ పార్టీని పటిష్ట పరచాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుబాష్‌చంద్రబోస్ పిలుపునిచ్చారు.

ప్రత్తిపాడు నియోజక వర్గ వైఎస్సార్ సీపీ  సమావేశంలో ప్రసంగిస్తున్న బోస్
 
ప్రత్తిపాడు : కార్యకర్తలందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, గ్రామ స్థాయి నుంచీ పార్టీని పటిష్ట పరచాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సభ్యు డు, మాజీ మంత్రి పిల్లి సుబాష్‌చంద్రబోస్ పిలుపునిచ్చారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలోని రవివర్మ మామిడి తోటలో సోమవారం జరిగిన నియోజకవర్గ స్థాయి  సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ప్రజా వ్యతిరేక చంద్రబాబు పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ఇప్పుడు డ్రామా లు ఆడుతున్నారని విమర్శించారు.  సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ టీడీపీ నాయకులు వేధింపులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
 
తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ అంగన్‌వాడీ వర్కర్ పోస్టు ఇవ్వడానికీ టీడీపీ నాయకులు సిగ్గులేకుండా లంచాలు అడుగుతున్నారని ఆరోపించారు. మాజీ జెడ్పీచైర్మన్ చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ బిడ్డ గర్బంలో పడిన నాటి నుంచీ వారి సంక్షేమం కోసం పాటుపడడం మనస్సున్న మారాజు రాజశేఖరునికే సాధ్యపడిందన్నారు. పార్టీ వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, దొంగ రామసత్యనారాయణ, అలమండ చలమయ్య తదితరులు ప్రసంగించారు. పార్టీ ప్రచార కన్వీనర్ రావూరి వెంకటేశ్వరరావు ప్రసంగం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.
 
తొలుత పార్టీ నాయకులకు బుద్దరాజు గోపీరాజు స్వాగతం పలికారు. కార్యక్రమంలో రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొమ్మిశెట్టి బాలకృష్ణ, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామి నాయుడు, జిల్లా యువజన విభాగం కన్వీనర్ అనంత ఉదయ్‌భాస్కర్, పార్టీ నాయకులు వాసిరెడ్డి జమీలు, మాకినీడు గాంధీ, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి జడ్పీటీసీ సభ్యులులు ముదునూరి లోవలక్ష్మి, జ్యోతుల పెదబాబు, చెన్నాడ సత్తిబాబు, సర్పంచ్‌లు ముచ్చర్ల నాగలక్ష్మి, యాళ్ల విశ్వేశ్వరరావు, సొసై టీ అధ్యక్షుడు జువ్వల చినబాబు  పాల్గొన్నారు.
 
ఎమ్మెల్యేలకు సన్మానం
అనంతరం ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరిలను కార్యకర్తలు ఘనంగా సత్కరించారు.
ఫొటోరైటప్ :29జెపిటి61-27020002: ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమీక్షా సమావేశంలో ప్రసంగిస్తున్న పిల్లి సుబాష్ చంద్రబోస్. 29జెపిటి62-27020002: ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు వరుపుల, దాడిశెట్టి, వంతల రాజేశ్వరిలను సత్కరిస్తున్న దృశ్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement