దీక్షకు మద్దతు ఇవ్వండి | Give support to the protest GUDIVADA Amarnath | Sakshi
Sakshi News home page

దీక్షకు మద్దతు ఇవ్వండి

Mar 30 2016 2:45 AM | Updated on May 25 2018 9:20 PM

దీక్షకు మద్దతు ఇవ్వండి - Sakshi

దీక్షకు మద్దతు ఇవ్వండి

విశాఖకు ప్రత్యేక జోన్‌ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ....

వివిధ పార్టీ నేతలను కలిసిన  వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
గుడివాడ అమర్‌నాథ్

 
సాక్షి, విశాఖపట్నం : విశాఖకు ప్రత్యేక జోన్‌ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఏప్రిల్ 14 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను కలుస్తున్నారు. మంగళవారం నగర కాంగ్రెస్ కార్యాలయంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ను, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణకుమారిలను కలిశారు. అలాగే సీపీఎం నగర, జిల్లా కార్యదర్శులు గంగారావ్, లోకనాథంలను ఆ పార్టీ నగర కార్యాలయంలోనూ కలిశారు.

ఈ సందర్భంగా తాను చేపట్టబోయే దీక్షకు మద్దతు పలకాలని, తద్వారా జోన్  ఏర్పాటుకు సహకరించాలని ఆయన కోరారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కంపా హనోకు, జాన్‌వెస్లీలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement