ఏపీ ఇంటర్‌లో బాలికలదే పైచేయి

Girls top in ap inter second year results  - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం/సాక్షి, అమరావతి: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. బాలురు కన్నా 7 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు. ఏపీ సీనియర్‌ ఇంటర్‌ పరీక్ష ఫలితాలను గురువారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఓ హోటల్‌లో ఏపీ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు.

మొత్తం 73.33 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 77 శాతం, బాలురు 70 శాతం పాస్‌ అయ్యారు. ఇక ఫలితాల్లో కృష్ణా జిల్లా 84 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో, 59 శాతం ఉత్తీర్ణతతో వైఎస్సార్‌ జిల్లా చివరి స్థానంలో నిలిచాయి. 77 శాతంతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ద్వితీయ, 76 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా తృతీయ స్థానం దక్కించుకున్నాయి.  

ఆయా గ్రూపుల్లో టాప్‌–3 విద్యార్థులు
ఎంపీసీ:కున్నం తేజవర్ధనరెడ్డి(992), అఫ్రీన్‌ షేక్‌(991), వాయలపల్లి సుష్మ(990), బైపీసీ: ముక్కు దీక్షిత(990), నారపనేని లక్ష్మీకీర్తి(990),కురుబ షిన్యథ(990), ఎంఈసీ: పోపూరి నిషాంత్‌ కృష్ణ(982), డి.మీనా    (981), జి.నాగవెంకట అభిషేక్‌(981 సీఈసీ: కాదంబరి గీత(968), ఎ.సెల్వరాజ్‌ ప్రియ(966), కాసా శ్రీరాం(964), హెచ్‌ఈసీ:    ముద్ద గీత(966), బొమ్మిడి లావణ్య(952), పప్పు సత్యనారాయణ(949).

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top