సాక్షి, కర్నూలు : జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గ ప్రజలపై అధికార తెలుగుదేశం పార్టీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న వారందరికీ రుణాలు రద్దయ్యాయి. వైఎస్ జగన్‌ను కలిసినందుకే తనకు మంజూరైన రుణాన్ని రద్దు చేశారని వెనుకబడిన కులానికి చెందిన లబ్ధిదారుడు అరవప్ప ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రజాసంకల్పయాత్రలో తాను పాల్గొన్నట్లు చెప్పారు. సాయంత్రానికి తనకు మంజూరైన రుణం రద్దు చేశారని తెలిపారు. తనకు మంజూరైన రుణాన్ని రద్దు చేయడంపై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు.