ట్రక్ బోల్తా: 14 మంది గాయాలు | Fourteen of marriage party injured as truck overturns | Sakshi
Sakshi News home page

ట్రక్ బోల్తా: 14 మంది గాయాలు

Aug 25 2013 1:03 PM | Updated on Sep 1 2017 10:07 PM

కడప- చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో ఈ రోజు ఉదయం పెళ్లి బృందంతో వెళ్తున్న మిని ట్రక్ బోల్తా పడింది.

కడప- చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో ఈ రోజు ఉదయం పెళ్లి బృందంతో వెళ్తున్న మిని ట్రక్ బోల్తా పడిన ఘటనలో 14 మంది గాయపడ్డారని రాయచోటి గ్రామీణ సీఐ ఆదివారం ఇక్కడ వెల్లడించారు. క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారన్నారు. 

జిల్లెలమందలో జరిగిన వివాహా వేడుకలకు హాజరై వారంతా స్వస్థలమైన నందలూరుకు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. కడప-చిత్తూరు సరిహద్దు ప్రాంతంలో రోడ్డు బాగా వాలుగా ఉంటుందని, అందువల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని భావిస్తున్నామని సీఐ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement