పెళ్లికి వెళ్లిన అతిథులు.. ఊహించని పని చేసి వచ్చారు

Madhya Pradesh: Wedding Guests Frog Jumps For Lockdown Violation - Sakshi

భోఫాల్: లాక్‌డౌన్ నిబంధ‌న‌లను పక్కన పెట్టి ఓ వివాహ వేడుక‌కు హాజ‌రైన అతిథుల‌కు పోలీసులు వింత శిక్ష విధించారు. ఈ ఘటన మ‌ధ్య‌ప్ర‌దేశ్ భింద్ జిల్లాలోని జ‌రిగింది. వివరాల ప్రకారం.. ఉమ‌రి గ్రామంలో ఓ పెళ్లి వేడుక‌కు సుమారు 300 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి  చేరుకున్నారు. పోలీసులను రావడాన్ని గమనించి చాలామంది పారిపోయారు గానీ అందులో 17 మంది మాత్రం దొరికిపోయారు. ఇక పోలీసులకు దొరికిన వారికి శిక్షగా నడిరోడ్డుపై కప్ప గంతులు వేయించారు. అనంతరం లాక్‌డౌన్‌ ఆంక్షలు పూర్తి అయ్యే వరకు ఇటువంటి ఉల్లంఘన చేయకూడదని వాళ్లని హెచ్చరించి వదిలేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌వీడియోలో వైరల్‌గా మారి హల్‌చల్‌ చేస్తోంది. 

చదవండి: కోడి గుడ్ల కోసం.. ఛీ ఇదేం పాడు పని పోలీసు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top