నాలుగేళ్లుగాపించను ఇవ్వలేదు

Four years not given Pension woman - Sakshi

నవ నిర్మాణ దీక్షలో మహిళ రోదన
ఒంగోలు సబర్బన్‌:  ‘భర్త చనిపోయాడు... ఒంటరినయ్యాను.. నాలు గేళ్లుగా పింఛను మంజూరు చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా...ఏ ఒక్క అధికారికీ నాపై దయ కలగలేదు. నేనేం పాపం చేశాను’ అంటూ ఒంగోలులో శనివారం జరిగిన నవ నిర్మాణ దీక్ష వద్దకు వచ్చిన ఆలపాటి రాజేశ్వరి అనే మహిళ బోరున విలపించింది. 

ఇళ్ల స్థలం లేదు... ఇల్లులేదు.. నిలువ నీడ లేక గుడిలో పడుకుంటున్నాను. రేషన్‌ కార్డు మాత్రం ఆరేళ్ల క్రితమే ఇచ్చారు. ఆధార్‌ కార్డు కూడా ఉంది. వితంతు పింఛనుకు అన్ని విధాలుగా అర్హురాలిని. ఒంగోలు తహశీల్దార్‌ కార్యాలయం చుట్టూ నాలుగేళ్లుగా కాళ్లరిగేలా తిరుగుతున్నాను. ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయం చుట్టూ కూడా తిరుగుతూనే ఉన్నాను’ అని ఆమె విలవిల్లాడింది. అధికారులను కలిసేందుకు ఆమె ప్రయత్నించటంతో వారు చూసి చూడనట్లు వెళ్లిపోయారు. ప్రకాశం భవన్‌ ఎదుట రాజేశ్వరి రోదన చూపరులను కలచివేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top