ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతు | four of a family missing in canal | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతు

Sep 4 2013 10:20 AM | Updated on Sep 1 2017 10:26 PM

కర్నూలు జిల్లాలో ...ఆటో లైటు వెలుతురులో వాగు దాటేందుకు ప్రయత్నిస్తూ .... నీటి ఉధృతికి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతు అయ్యారు.

కర్నూలు : కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెక్డామ్లు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆటో లైటు వెలుతురులో వాగు దాటేందుకు ప్రయత్నిస్తూ .... నీటి ఉధృతికి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతు అయ్యారు. గల్లంతు అయినవారిలో మూడు మృతదేహాలు లభించాయి.

ఇంకా మూడు నెలల పసికందు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గోనెగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన సుమారు యాభైమంది ఎమ్మిగనూరులో ఓ సభకు హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా గత రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడటంతో స్థానికంగా విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement