బొమ్మరిల్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం కేసుకు సంబంధించి నలుగురు డైరెక్టర్లను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు.
విశాఖ: బొమ్మరిల్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం కేసుకు సంబంధించి నలుగురు డైరెక్టర్లను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. తక్కువ ధరకే ఇళ్ల స్ధలాలు ఇప్పిస్తామని చెప్పి ఖాతాదారులను మోసం చేస్తున్నారని బాధితుల ఫిర్యాదుతో వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజారావుతో పాటు, ఆయన భార్య, సోదరుడు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా ఆయన స్థిరాస్తులకు సంబంధించి ఐదు కార్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఇప్పటికే ఆ రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని పోలీసులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. శనివారం బొమ్మరిల్లు కార్యాలయంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు పలు ఫైళ్లను, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. మూడు నెలలుగా ఈ సంస్ధలోని ఖాతాదారులకు ఎటువంటి చెల్లింపులు చేయడంలేదంటూ భాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.