వాడుకుని వదిలేశారు ‘బాబూ’

Folk artists Program on Chandrababu Naidu Government Negligence - Sakshi

ఆనం కళాకేంద్రంలో కళాకారుల కన్నీరు

కళాకారుల గుండె గోడు 

తూర్పుగోదావరి,రాజమహేంద్రవరం కల్చరల్‌: ఆ కళాకారులు కాళ్లరిగిలా వాడవాడలా తిరిగి ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేశారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డి.విజయభాస్కర్‌ ఆదేశాల మేరకు 2018 ఆగస్టు నుంచి 2019 జనవరి వరకు 13 జిల్లాల్లో, ఆరు నెలలపాటు 74 దళాలు కాలికి బలపం కట్టుకుని గ్రామదర్శిని, నగర దర్శిని, జన్మభూమి ఇతర పథకాలపై జానపద కళారూపాలతో జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేశారు. జిల్లాకు కోటి రూపాయల చొప్పున నాటి ప్రభుత్వం కళాకారులకు రూ.13 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఒక్క రూపాయి విదల్చ లేదని, జిల్లా జానపద కళాకారుల సంక్షేమ సంఘం కో ఆర్డినేటర్, ప్రముఖ బుర్రకథ కళాకారుడు విభూతి బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆనం కళాకేంద్రంలో జానపద కళాకారులు బాబురావు ఆధ్వర్యంలో పలు రూపకాలను ప్రదర్శిస్తూ ఆవేదనను  కళ్లకు కట్టేటట్టు ప్రదర్శించారు. మనసున్న ప్రజానేత సీఎం జగనన్న తమను ఆదుకుంటారని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top