వంశధారకు వరద ఉధృతి.. 1వ ప్రమాద హెచ్చరిక జారీ | Sakshi
Sakshi News home page

వంశధారకు వరద ఉధృతి.. 1వ ప్రమాద హెచ్చరిక జారీ

Published Sun, Jul 22 2018 12:38 PM

Flood Flow Heavy At Vamsadhara River In Srikakulam - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : గతకొద్ది రోజులుగా ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వంశధార నది పొంగి పొరలుతోంది. నీటి మట్టం అంతకంతకు పెరిగిపోతుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అంతేకాకుండా హీర మండలంలోని గొట్టా బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం 60వేల క్యూసెక్కులకు చేరిన వరద నీటి ప్రవాహం మధ్యాహ్నానికి లక్ష క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో వంశధార నది తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. కొత్తూరు మండలంలోని 12, హిర మండలంలోని 9, ఎల్‌ఎన్‌పేట మండలంలోని 6 గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement