క్వారంటైన్‌కు 1,700 మంది 

Fishermen Who Had Gone To Karnataka Were Brought To Nellore - Sakshi

కర్ణాటకలో చిక్కుకున్న నెల్లూరు, ప్రకాశం జిల్లాల మత్స్యకారులు

మంత్రి అనిల్‌కుమార్‌ చొరవతో జిల్లాకు తరలింపు 

సాక్షి, నెల్లూరు: కర్ణాటకలో జీవనోపాధి కోసం వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన దాదాపుగా 1,700 మంది జాలర్లను ఎట్టకేలకు జిల్లాకు తీసుకుని వస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వీరందరూ కర్ణాటక సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లారని, కరోనా వైరస్‌ ప్రబలుతుండడంతో లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్వగ్రామాలకు వచ్చేందుకు వీలు లేకుండా పోయింది. వీరు సొంత జిల్లాలకు రావాలని చూసినా ఆంక్షల కారణంగా అక్కడి అధికారులు కర్ణాటక సరిహద్దులోని క్వారంటైన్‌లో ఉంచారు. అక్కడ వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆఫ్కాబ్‌ చైర్మన్‌ కొండూరు అనిల్‌బాబు రాష్ట్ర మంత్రి పి అనిల్‌కుమార్‌ దృష్టికి తీసుకు వచ్చారు. (లాక్‌డౌన్‌:  బాయ్‌ఫ్రెండ్‌ను మిస్ అవుతున్న క్రీడాకారిణి)

దీంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సీఎంఓ అధికారులు మంత్రి అనిల్‌ మాట్లాడారు. కాగా అక్కడి కర్ణాటక అధికారులతో కూడా చర్చించి ఎట్టకేలకు సరిహద్దులో ఉన్న జాలర్లను జిల్లాకు తీసుకు వచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు. వీరందరిని గూడూరులోని ఆదిశంకర కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో వారిని ప్రత్యేక వాహనంలో తీసుకువస్తున్నారు. ఎమ్మెల్యేలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మంత్రి పి అనిల్‌కుమార్, ఆఫ్కాబ్‌ చైర్మన్‌ కొండూరు అనిల్‌బాబు చొరవతో జాలరర్లు జిల్లాకు వస్తుండడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.    

క్వారంటైన్‌కు పెరిగిన బాధితులు – ఒక్కసారిగా 73 మంది తరలింపు 
నెల్లూరు(అర్బన్‌): తాజాగా ప్రకాశం జిల్లాలో మరో ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆ జిల్లా అధికారులతో పాటు నెల్లూరు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల మత పరమైన కార్యక్రమానికి కొంత మంది ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో నెల్లూరు, చీరాల ప్రాంతానికి చెందిన వారు ఒకే బోగీలో ఈ నెల 17న ప్రయాణించారు. ప్రస్తుతం పాజిటివ్‌ వచ్చిన వారు కూడా అదే బోగీలో ప్రయాణించడంతో అధికారులు లెక్కలు తీశారు. ఆ బోగీలో 300 మంది వరకు ప్రయాణించినట్టు గుర్తించారు. వారందరినీ గుర్తించి క్వారంటైన్‌కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. (లాక్‌డౌన్‌కు నై..)

ఇలా ఇప్పటికే నెల్లూరు డైకస్‌రోడ్డు ప్రాంతానికి చెందిన 23 మందిని గుర్తించి ఆదివారం రాత్రి పెద్దాస్పత్రిలోని క్వారంటైన్‌ వార్డుకు తరలించారు. చీరాల ప్రాంతంలో మరో 40 మందిని గుర్తించిన అధికారులు వారిని కూడా కోవిడ్‌ రీజినల్‌ ఆస్పత్రిగా మార్చిన నెల్లూరుకే తరలించారు. ఇంత పెద్ద మొత్తంలో అనుమానితులను క్వారంటైన్‌కు తరలించడంతో జిల్లాలో సంచలనంగా మారింది. కలెక్టర్‌ శేషగిరిబాబు, ట్రెయినీ కలెక్టర్‌  కల్పనాకుమారి, సీఐ నాగేశ్వరమ్మ, వైద్యాధికారులు వారిని పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనా వార్డుకు అల్లూరు ప్రాంతం నుంచి మరో అనుమానిత కేసు కూడా అర్ధరాత్రికి పెద్దాస్పత్రికి వచ్చింది.   

అల్లూరులో... 
అల్లూరు: ఈ నెలలో మతపరమైన కార్యక్రమం కోసం ఢిల్లీకి వెళ్లి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండటంతో గుంటూరులోని ప్రభుత్వాస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అప్రమత్తమైన అధికారులు అతను ప్రయాణించిన రైలుబోగీలోని ప్రయాణికుల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. అల్లూరు మండలం నుంచి ముగ్గురు వ్యక్తులు ఆ బోగీలోనే ప్రయాణించినట్టు వారికి తెలిసింది. ముగ్గురిలో ఒకరు మండలంలోని ఇస్కపల్లి కుర్రు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మరో ఇద్దరు అల్లూరు, నార్త్‌మోపూర్‌ ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించారు.   వీరిని నెల్లూరు పెద్దాస్ప త్రిలోని కరోనా వార్డుకు తరలించేందుకు చర్యలు చేపట్టారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

05-06-2020
Jun 05, 2020, 20:26 IST
కోల్‌క‌తా: ‘ఓవైపు క‌రోనా, మ‌రోవైపు అంఫ‌‌న్‌తో పోరాడుతుంటే కొన్ని పార్టీలు మ‌మ్మ‌ల్ని అధికారం నుంచి తొల‌గించాలని చూస్తున్నాయి. ఇది నిజంగా బాధాకరం....
05-06-2020
Jun 05, 2020, 20:18 IST
వాషింగ్టన్‌: అమెరికాలో నూతనంగా 2.5 మిలియన్‌ మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ క్రమంలో మే నాటికి నిరుద్యోగిత రేటు 13.3...
05-06-2020
Jun 05, 2020, 18:59 IST
సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ‌ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక నిబంధనలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది....
05-06-2020
Jun 05, 2020, 18:53 IST
పట్నా : లాక్‌డౌన్‌తో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రయత్నిస్తున్న తరుణంలో బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వ...
05-06-2020
Jun 05, 2020, 18:40 IST
ఢిల్లీ : టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన పెట్‌ డాగ్‌తో దిగిన క్యూట్‌ ఫోటోలను...
05-06-2020
Jun 05, 2020, 17:50 IST
ముంబై: లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో మహారాష్ట్ర మహా వికాస్‌ అఘాడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు...
05-06-2020
Jun 05, 2020, 17:29 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ దెబ్బతో అంతర్జాతీయంగా అన్ని రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా పర్యాటక రంగం తీవ్రంగా నష్టపోయింది. కరోనా...
05-06-2020
Jun 05, 2020, 16:41 IST
ఇస్లామాబాద్‌ :  ప్రపంచ ప్రజానీకంపై పగడవిప్పుతున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ ఏ ఒక్కరినీ వదలట్లేదు. పల్లె నుంచి పట్నం వరకు ప్రపంచ...
05-06-2020
Jun 05, 2020, 16:03 IST
అసాధ్యం అనుకున్న పనులెన్నిటినో కంటికి కనిపించని ఓ చిన్న వైరస్‌ సుసాధ్యం చేసింది.. ప్రపంచ దేశాలన్నింటిని గడగడలాడిస్తోంది. చైనాలో పుట్టిన కరోనా...
05-06-2020
Jun 05, 2020, 15:52 IST
ఢిల్లీ : క‌రోనా వైర‌స్‌తో ఏర్ప‌డిన లాక్‌డౌన్ వ‌ల్ల ఎవ‌రూ ఎక్కడికి కదల్లేని పరిస్థితిగా మారింది. దాదాపు రెండు నెల‌ల నుంచి...
05-06-2020
Jun 05, 2020, 15:20 IST
చెన్నై: దక్షిణాదిలో తమిళనాడులో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. రోజుకు వెయ్యికిపైగా కేసులు నమోదవుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి....
05-06-2020
Jun 05, 2020, 14:50 IST
రోమ్‌: మహమ్మారి కరోనా(కోవిడ్‌-19) ధాటికి అతలాకుతలమైన దేశాల్లో ఇటలీ ఒకటి. దాదాపు 6 కోట్ల జనాభా ఉన్న ఈ యూరప్‌...
05-06-2020
Jun 05, 2020, 13:30 IST
యాదాద్రి భువనగిరి, కేతేపల్లి (నకిరేకల్‌) : మండలంలోని చెర్కుపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు గురువారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణయ్యింది....
05-06-2020
Jun 05, 2020, 13:26 IST
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా జిల్లాలోనూ ప్రబలుతోంది. ఈ కోవిడ్‌ లింక్‌ను తెంచేందుకు జిల్లా యంత్రాంగం అవిరళ కృషి చేస్తోంది....
05-06-2020
Jun 05, 2020, 12:59 IST
వారం రోజుల్లో సమాధానం చెప్పాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. 
05-06-2020
Jun 05, 2020, 12:54 IST
సాక్షి, మెదక్‌: మెదక్‌ జిల్లా చేగుంటలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. మహమ్మారి కరోనా వైరస్‌ నుంచి కోలుకొని సంతోషంతో పుట్టిన...
05-06-2020
Jun 05, 2020, 12:50 IST
ఇంపాల్‌: మరణించిన తండ్రిని చూడటం కోసం అంజలి హమాంగ్టే(22) స్వగ్రామం కాంగ్‌పోక్పి వచ్చింది. దూరం నుంచే తండ్రి శవపేటికను చూస్తూ ఏడుస్తుంది....
05-06-2020
Jun 05, 2020, 12:03 IST
నాగోలు:  కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో దాని నుంచి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాల్సిందే.. కరోనా నుంచి...
05-06-2020
Jun 05, 2020, 11:29 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా దాదాపు 2 నెలల నుంచి దేశంలోని ఆలయాలన్ని మూసి వేశారు. లాక్‌డౌన్‌ 5.0లో దేశవ్యాప్తంగా...
05-06-2020
Jun 05, 2020, 11:16 IST
జీర్ణవ్యవస్థ సాఫీగా ఉంటే వ్యాధుల ముప్పు తగ్గినట్టే
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top