గోదావరి నదిలోకి చేపలవేటకు వెళ్లి మత్స్యకారుడు మృతిచెందిన సంఘటన పి.గన్నవరం మండలం కె.ముంజవరం వద్ద గోదావరిలో చోటుచేసుకుంది.
పి.గన్నవరం (తూర్పుగోదావరి) : గోదావరి నదిలోకి చేపలవేటకు వెళ్లి మత్స్యకారుడు మృతిచెందిన సంఘటన పి.గన్నవరం మండలం కె.ముంజవరం వద్ద గోదావరిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కె.ముంజవరం గ్రామానికి చెందిన మల్లాడి పెద అచ్చయ్య(44) అనే మత్స్యకారుడు ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో చేపలు పట్టడానికి తన పడవలో గోదావరి నదిలోకి వెళ్లాడు. చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తూ నదిలో పడి చనిపోయాడు. ఆయన మృతదేహాన్ని తోటి మత్స్యకారులు వెలికి తీశారు.