జిల్లాలో ఒంగోలు డైరీలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది.
ప్రకాశం: జిల్లాలో ఒంగోలు డైరీలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్య్కూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.