హోటల్‌కు చెందిన కార్యాలయంలో ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం జరిగి సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.
ఎస్.పేట (విశాఖపట్నం) : హోటల్‌కు చెందిన కార్యాలయంలో ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం జరిగి సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా ఎస్.పేటలోని శంకర్ మఠం రోడ్డులో ఉన్న సత్య ఎన్‌క్లేవ్‌లో గురువారం చోటుచేసుకుంది. ఎన్‌క్లేవ్‌లోని మొదటి అంతస్థులో హోటల్ బెజ్ కృష్ణకు చెందిన కార్యాలయం నిర్వహిస్తున్నారు.
ఇందులో హోటల్‌కు అవసరమైన సరుకులతోపాటు, బెడ్ షీట్లు, కవర్స్, ఏసీలు, తదితర వస్తువులు నిల్వ ఉంచారు. గురువారం కార్యాలయంలో నుంచి మంటలు ఎగిసి పడటాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన జరిగనట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.