ఆటోమొబైల్ షాపు దగ్ధం | Fire accident in Auto mobile shop | Sakshi
Sakshi News home page

ఆటోమొబైల్ షాపు దగ్ధం

Mar 6 2016 2:41 PM | Updated on Sep 5 2018 9:45 PM

చిత్తూరు జిల్లా రామకుప్పంలోని బజారువీధిలో ఉన్న కార్తీక్ ఆటో మొబైల్ షాపు ఆదివారం ఉదయం దగ్ధమైంది.

రామకుప్పం (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా రామకుప్పంలోని బజారువీధిలో ఉన్న కార్తీక్ ఆటో మొబైల్ షాపు ఆదివారం ఉదయం దగ్ధమైంది. తమిళనాడుకు చెందిన కార్తీక్ అనే వ్యక్తి ఈ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. దుకాణంలో నుంచి మంటలు, పొగలు రావడంతో గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

అగ్నిమాపక వాహనం వచ్చేలోగానే దుకాణం కాలిబూడిదైంది. దాదాపు లక్ష రూపాయల మేర నష్టం వాటినల్లినట్లు యజమాని కార్తీక్ తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌వల్లే అగ్నిప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement